వాగులో జారి పడి మహిళా గల్లంతు

MBNR: వాగులో జారిపడి మహిళా గల్లంతైన ఘటన జడ్చర్ల మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన జ్యోతి (34) పొలం పనులకు వెళ్తుండగా వాగులో జారి పడి గల్లంతయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.