గరికపాటిని దేశ బహిష్కరణ చేయాలి: భీమ్ సేన
VSP: స్కూల్ పిల్లల భోజనంపై ప్రవచనకర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భీమ్ సేన విశాఖ డాబా గార్డెన్స్ కూడలి అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. గరికపాటిపై రాజద్రోహం కేసు పెట్టి.. దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఇచ్చిన పద్మ శ్రీని వెనక్కి తీసుకుని అరెస్ట్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.