VIDEO: అజ్జంపూడిలో మరియమాత తేరు ఊరేగింపు

కృష్ణా: గన్నవరం మండలం అజ్జంపూడిలో శుక్రవారం రాత్రి మరియమాత మోక్షారోహణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి నుంచి క్రైస్తవులు పురవీధుల్లో తేరు ఊరేగింపును భక్తిశ్రద్ధలతో చేశారు. అనంతరం MF ప్రొవిన్షియల్ ఫాదర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మరియమాత ఔన్నత్యాన్ని MF ఫాదర్లు భక్తులకు వివరించారు.