VIDEO: అరటి తోట దగ్ధం.. రైతులకు భారీ నష్టం..!
అన్నమయ్య: పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లిలో శనివారం దారుణం జరిగింది. పక్వానికి వచ్చిన 18 ఎకరాల అరటి తోటను ఆకతాయిలు నిప్పు పెట్టి తగలబెట్టారు. ఈ ప్రమాదంలో సుమారు 16 వేలకు పైగా అరటి చెట్లు కాలి బూడిదయ్యాయి. మార్కెట్‌లో మంచి ధర ఉన్న సమయంలో పంట చేతికొచ్చే తరుణంలో ఇలా జరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.