'ఉచిత ప్రయాణం చేయాలంటే ఇవి తప్పనిసరి'

'ఉచిత ప్రయాణం చేయాలంటే ఇవి తప్పనిసరి'

KRNL: స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార కార్డు, రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డును కలిగి ఉండాలని ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఉచిత ప్రయాణం అందించరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నియమాలను పాటించాలన్నారు.