ధర్మాన పై దువ్వాడ ఫైర్
SKLM: వైసీపీ 'మూలపేటకు పోదాం' మీటింగ్‌పై దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. జగన్ ఆశయాలను ధర్మాన ప్రసాదరావు తుంగలో తొక్కారని మండిపడ్డారు. పోర్టుకు పోదాం అని పిలుపునిచ్చి లోపలికి ఎందుకు వెళ్లలేదు..? అని ప్రశ్నించారు. కింజరాపు, ధర్మాన కుటుంబాలు కలిసి ఆడుతున్న నాటకమే ఈ మీటింగ్ అని పేర్కొన్నారు. భూసేకరణ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామాలని తెలిపారు.