నాటు బాంబుల కలకలం

తిరుపతి: పాకాల మండలం చెన్నుగారిపల్లెలో నాటు బాంబుల కలకలం రేపింది. సబ్ స్టేషన్ పక్కన ఓ ఇంటిలో 26 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. నాటు బాంబులను స్వాధీనం చేసుకుని బాబు, గజేంద్రలను అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అడవి పందుల కోసం తయారు చేసుకున్నట్లు నిందితులు తెలియజేశారు.