ఆలయానికి రూ.20 వేల విరాళం
NLG: నల్గొండ కార్పొరేషన్ 20 డివిజన్ పెద్ద బండలోని మల్లికార్జున స్వామి ఆలయానికి నూతన కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ రూ.20 వేల విరాళం ఇవాళ ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న నిర్వహించనున్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ఈ విరాళాన్ని ఆయన ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల సత్తయ్య, జక్కల చిన్న సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.