రూ.160 కోట్లతో ఉప్పల్ TO అంబర్ పేట్ లింక్ రోడ్డు
MDCL: ఉప్పల్ ప్రజలకు గుడ్ న్యూస్. అంబర్‌పేట్ అలీకేఫ్ నుంచి ఉప్పల్ నల్లచెరువు వరకు వరంగల్ జాతీయ రహదారిని కలుపుతూ కొత్త లింక్ రోడ్డును నిర్మించనున్నారు. రూ.160 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్-1 కింద పటేల్ నగర్ ఎస్టీపీ, డీ మార్ట్ మీదుగా ఈ రహదారి పనులు చేపట్టనున్నారు. ఇందుకు జిహెచ్ఎంసి ఆమోదం తెలిపినట్లుగా కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.