'మైనార్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మించాలి'

KRNL: ఆదోని శివారులోని మైనార్టీ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని అవాజ్ కమిటీ కార్యదర్శి ఇక్బాల్ కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీ కోసంలో వినతిపత్రం ఇచ్చారు. కాలనీ ఏర్పడి 20 సంవత్సరాల అయిందని, ఇప్పటికి రాకపోకలకు మెయిన్ రోడ్డు లేదన్నారు. మట్టి రోడ్లు ఉన్నాయని, వర్షం వస్తే బురదమయం అవుతుందన్నారు.