'విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి'

VZM: పిల్లల విద్యాభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. శనివారం జామి మండలం కుమరాం కేజీబీవీ పాఠశాలను మంత్రి శ్రీనివాస్ సందర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.