ప్రభుత్వ విప్ అశోక్ బాబు నేటి పర్యటన వివరాలు

SKLM: సోంపేట మండల పరిధిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బి.అశోక్ బాబు పాల్గొంటారని సోంపేట టీడీపీ మండల కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇసుకలపాలెం పంచాయితీలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, రామయ్య పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.