VIDEO: నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

E.G: అనపర్తి నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిక్కవోలులోని లక్ష్మీ గణపతి, గోలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు గొల్లల మామిడాడ సూర్య దేవాలయం, కోదండ రామాలయాలను గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు.