ఆగస్టు 15 వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఆగస్టు 15 వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

KMM: ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహాన గురించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశేటి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.