శ్రీవారి సేవలో మంత్రి వీరాంజనేయ స్వామి

TPT: మంత్రి బాల వీరాంజనేయ స్వామి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సంక్షేమ రంగానికి పెద్దపీట వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి రూ.310 కోట్లు, హాస్టల్ నిర్మాణాలకు రూ. 100 కోట్లు, స్వచ్ఛాంధ్ర మిషన్‌కు రూ.51 కోట్లు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.