వేణుగోపాలుని ఆలయానికి విరాళం
NTR: గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి దేవస్థానం నిత్య అన్నదానం కోసం ఖమ్మం జిల్లాకు చెందిన చరణ్ తేజ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.40 వేల నగదు, రూ. 35 వేలు విలువ గల వాటర్ కూలర్‌ను అందజేశారు. ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.