అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి
MBNR: జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు రామకృష్ణ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నిరుపేద అయిన బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.