బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. హసీనా భవితవ్యంపై ఉత్కంఠ!

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. హసీనా భవితవ్యంపై ఉత్కంఠ!

మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ICT) వేసిన కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. దీంతో ఆ దేశంలో హై అలర్ట్ నెలకొంది. గతేడాది హింసాత్మక ఆందోళనల తర్వాత భారత్‌కు పారిపోయి వచ్చిన హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తీర్పు నేపథ్యంలో విమానాశ్రయాలు, కీలక ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు మోహరించారు.