VIDEO: ఉప్పరగూడెంలో శరవేగంగా అభివృద్ధి పనులు
E.G: గోపాలపురం(మం) ఉప్పరగూడెం గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఒక కల్వర్టు నిర్మాణాన్ని పూర్తి చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఎమ్మెల్యే చొరవతో ఏళ్లనాటి సమస్యలు పరిష్కారమవుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.