ఓ వైపు యుద్ధం.. మరోవైపు భూకంపం

ఓ వైపు యుద్ధం.. మరోవైపు  భూకంపం

పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్‌ను భూకంపం వణికించింది. ఇవాళ మధ్యాహ్నం గెరాష్ నగరంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు వెల్లడించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.