VIDEO: కూలిన భారీ చెట్టు.. రాకపోకలకు అంతరాయం
NRPT: మక్తల్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం తీవ్రమైన గాలులు వీచాయి. దీంతో మండలంలోని దాసరి దొడ్డి గ్రామానికి వెళ్లే రహదారిలో భారీ చెట్టు రోడ్డుపై కూలిపోయింది. అదృష్టవశాత్తు సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో గ్రామ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్రామస్తులు చెట్టును తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు.