నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ సర్వే నిర్వహించిన సీఐ
VZM: ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాటిని నివారించేందుకు సీఐ నారాయణమూర్తి నడుంబిగించారు. అందులో భాగంగా పట్టణంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో గురువారం సిబ్బందితో డ్రోన్ సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రోన్ సర్వేలో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని సీఐ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.