'2027 నాటికి పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం'
ELR: పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.