ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేష్

ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేష్

AP: టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ 70వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ క్రమంలో సమస్యలను విన్నవించుకోవడానికి పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. వారందరి నుంచి ఆర్జీలు స్వీకరించిన లోకేష్.. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని, బాధితులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. నాలుగు గంటల పాటు దాదాపు 4 వేల మందికి పైగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.