రైతు బీమా సొమ్ము కాజేసిన ఏఈఓ

రైతు బీమా సొమ్ము కాజేసిన ఏఈఓ

MHBD: గిరిజన రైతును కురవి మండల ఏఈఓ మోసం చేసి రూ.5 లక్షలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కురవి మండలం గుండ్రాతిమడుగు గేటు తండాలోని బానోత్ ఇరానీ రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోగా నగదు జమ అయ్యాయి. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఏఈఓ.. చెక్కుపై సంతకం చేయించుకుని తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు.