'తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలి'
PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలో టపాసులు, ఉన్ని దుస్తుల విక్రయాలు తదితర సీజనల్ వ్యాపారాలు చేసే వారు తప్పనిసరిగా తాత్కాలిక కాల వ్యవధికి సంబంధించి ట్రేడ్ లైసెన్సులను తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ తెలిపారు. ఆన్‌లైన్‌లో మున్సిపల్ వెబ్ సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి లైసెన్స్ కోసం బిల్లు చెల్లించాలన్నారు.