పర్యావరణహిత వస్తు ప్రదర్శన
NRPT: చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పర్యావరణహిత వస్తు ప్రదర్శన ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్డ్స్ సహకారంతో కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తాము తయారు చేసిన పర్యావరణహిత వస్తువులను స్టాళ్లలో ప్రదర్శించారు.