VIDEO: ఏఎంసీ ఛైర్మన్ పదవిపై శివశంకర్ స్పందన

కృష్ణా: గన్నవరం ఏఎంసీ ఛైర్మన్ పదవిపై గరికపాటి శివశంకర్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పొత్తులో భాగంగా గన్నవరం ఏఎంసీ పదవి రావచ్చు, రాకపోవచ్చని ముందుగానే అధిష్టానం తెలిపినట్లు ఆయన వివరించారు. పదవి రాకపోవడం పట్ల జనసైనికులు ఆవేదన చెందవద్దని కోరారు. పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడతానని ఆయన స్పష్టం చేశారు.