'మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి'

'మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలి'

NRPT: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులకు సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో యాంటీ నార్కోటిక్స్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిఘా పెట్టాలని చెప్పారు. డ్రగ్స్ నివారణకు పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.