'వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి'

MNCL: పంటలకు క్రిమిసంహారక మందులు వాడే విషయంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడిన నేపథ్యంలో పంటలకు వివిధ తెగుళ్ళు సోకే ప్రమాదం ఉందన్నారు. వాటి నివారణ కోసం రైతులు సొంతంగా క్రిమిసంహారక మందులు వాడవద్దని, వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ఆయన కోరారు.