జనగామ జిల్లా కోర్టుకు హాజరైన మాజీ మంత్రి

JN: జనగామ జిల్లా ఉద్యమ కేసు విచారణపై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం జనగామ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. అనంతరం గిర్నిగడ్డలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ధర్మపురి శ్రీనివాస్, ఆకుల సతీష్, అంజయ్య, గురువయ్య తదితరులున్నారు.