VIDEO: తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
HNK: మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలను గురువారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. నడికుడా మండలం ముస్తాలపల్లి, దామెర మండలం పసరగొండ క్రాస్, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామాల్లో రైతులను కలసి పంట నష్టాన్ని తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు.