ధ్వజావరోహణంతో ముగిసిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ధ్వజావరోహణంతో ముగిసిన అమ్మవారి బ్రహ్మోత్సవాలు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 10 గంటలకు గజ పటాన్ని అవనతం చేసి, ఆహ్వానించిన దేవతలను సాగనంపారు. ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నవారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో పాటు విషమృత్యు నాశనం, రాజ్యపదవులు వంటి సకల శ్రేయస్సులను పొందుతారని ఐతిహ్యం.