VIDEO: కల్వర్టు నిర్మించారు.. రక్షణ గోడలు మరిచారు..!
KDP: ఖాజీపేట మండలం రావులపల్లెకు వెళ్లే దారిలో కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన కల్వర్టుకు అధికారులు రక్షణ గోడలు ఏర్పాటు చేయలేడు. ఇటీవల పైపులైన్ పనుల నిమిత్తం పాత కల్వర్టు తొలగించి నూతనంగా కల్వర్టు నిర్మించారు. కల్వర్టుకు ఇరు వైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉందని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.