పరీక్షను సమగ్రవంతంగా నిర్వహించండి

SKLM: నందిగాం మండలంలో స్వచ్ఛంద సేవకుల సహాయంతో గతంలో విద్య నేర్చుకున్న 1245 మంది నిరక్షరాస్యులకు ఆదివారం ఉదయం 10 నుంచి 5 గంటల లోపల జరుగబోయే ఉల్లాస్ పరీక్షను ఇన్విజిలేటర్లు సమగ్రవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో రాజారావు అన్నారు. ఈ మేరకు స్థానిక వెలుగు కార్యాలయంలో పరీక్షల సామగ్రిని శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మనోరత్నం పాల్గొన్నారు.