అక్కడ వైద్యం కావాలంటే వాగు దాటాల్సిందే..!

ASF: కెరమెరి మండలంలోని బోరిలాల్‌గూడ అంగన్‌వాడీ కార్యకర్త కవిత తీవ్ర అస్వస్థతతో బాధ పడుతోంది. దీంతో బుధవారం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. వైద్యం కావాలంటే అనార్‌పల్లి వాగు దాటాలి. ప్రవాహం పెరగడంతో గ్రామస్తులు ఆమెను ఎత్తుకొని వాగు దాటించారు. వంతెన లేక ఎన్నో కష్టాలు పడుతున్నామని, దశాబ్ద కాలంగా వంతెన నిర్మాణ దశలోనే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.