చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి
JGL: రాయికల్ మండలం సింగర్ రావు పేట శివారు మార్గంలో బైక్‌పై వెళ్తుండగా చెట్టును ఢీకొని లింగంపేట గ్రామానికి చెందిన సిరికొండ చంద్రశేఖర్ (25)అనే యువకుడు శనివారం మృతి చెందినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు. తాట్లవాయి గ్రామానికి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్నట్టు పేర్కొన్నారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.