రక్త దానం.. ప్రాణ దానంతో సమానం

రక్త దానం.. ప్రాణ దానంతో సమానం

RR: రక్త దానం ఆపదలో ఉన్నవారికి ప్రాణ దానం చేయడంతో సమానమని కాటేదాన్ అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు సూచించారు. నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా కాటేదాన్ శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం తలసేమిమా బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంకురి జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.