ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష: మంత్రి లోకేష్

ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష: మంత్రి లోకేష్

బాపట్ల: ​"నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక రోజు ఇదని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మద్దతు తెలిపిన పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం రాజధాని రైతుల త్యాగాలకు దక్కిన ప్రతిఫలమన్నారు.