టెన్త్ విద్యార్థులకు నిత్యం పౌష్టికాహారం అందజేత

టెన్త్ విద్యార్థులకు నిత్యం పౌష్టికాహారం అందజేత

ELR: పెదపాడు మండలం అప్పన వీడు జడ్పీ హైస్కూల్ ఆవరణములో 61 మంది టెన్త్ విద్యార్థులకు మంగళవారం సెనగలు అందించారు. పాఠశాల హెచ్ఎం తోట పుష్పావతి మాట్లాడుతూ.. అదనపు తరగతుల నిర్వహణకు బొప్పాయి, అరటి, కర్బూజా, జామ, సెనగలు, ఉప్మా, బిస్కెట్లు టెన్త్ విద్యార్థులకు నిత్యం అందిస్తున్నట్లు చెప్పారు. పౌష్టికాహారంతో విద్యార్థులలో అద్భుతమైన ఫలితాలు సాధ్యమన్నారు.