మత్స్యకారుల కోసం పవన్ ప్రత్యేక చర్యలు
AP: ఉప్పాడ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఇందుకోసం 60 మంది మత్స్యకారులను అధికారులు రెండు ప్రత్యేక బస్సుల్లో అక్కడికి పంపుతున్నారు. ఈ శిక్షణలో వారు ఆధునిక చేపల వేట పద్ధతులు, మార్కెటింగ్ వ్యూహాలు నేర్చుకోనున్నారు.