సంజూ శాంసన్ ఓపెనర్ కాదు: అజిత్ అగార్కర్

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓపెనర్ కాదని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టు అవసరాల కోసం మాత్రమే అతను ఓపెనర్‌గా ఆడాడని స్పష్టం చేశాడు. శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు లేవని అగార్కర్ పరోక్షంగా చెప్పాడు.