పత్తి రైతులకు శుభవార్త

పత్తి రైతులకు శుభవార్త

NGKL: వంగూర్ మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి అమ్మే రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుభవార్త అందించింది. పత్తి కొనుగోలును ఎకరాకు 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లకు పెంచినట్లు తిప్పారెడ్డిపల్లి రైతు వేదిక క్లస్టర్ వ్యవసాయ అధికారి జైపాల్ బుధవారం తెలిపారు. మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.