కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అ. కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అ. కలెక్టర్

SRCL: వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిలువలు చూసి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ వేగంగా పూర్తి చేసి, ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు.