గుక్కెడు నీటి కోసం ఎన్ని అవస్థలో..

PPM: నీటి కోసం లోయలు, గుట్టలు దాటుతూ చిన్నపిల్లలను ఓ వైపు.. మరో వైపు నీటి బిందెలతో ప్రయాణిస్తూ వారు పడుతున్న కష్టం వర్ణనాతీతంగా ఉంది. పాచిపెంట మండలంలోని బొర్రమామిడి పంచాయతీ పూతికవలన తదితర గ్రామాల గిరిజనులు తాగునీటికి కోసం సుమారు కిలోమీటర్ మేర గిరి శిఖర ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఊట నీటిని సేకరిస్తున్నారు.