ఆర్మూర్‌లో మోస్తరు వర్షం
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం 6 గంటలకు సమయంలో పెర్కిట్, మామిడిపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఒకసారి ఆకాశం మేఘావృతమై ఉండగా, అకస్మాత్తుగా కురిసిన వానతో బయటకు వెళ్లిన వాహనదారులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.