ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

మేడ్చల్: అల్వాల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ప్రతీవార్డు తిరుగుతు అక్కడ అందుతున్న ఆరోగ్యసేవలు నిత్యం వస్తున్న అవుట్ పేషెంట్స్ వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విధులకు గైర్హాజరు అవుతున్న వైద్యురాలు శ్వేతను సస్పెండ్ చేశారు.