'అన్న క్యాంటీన్లు ప్రజల ఆకలి తీర్చుతున్నాయి'
AP: బళ్లారిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలతో మంత్రి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం బళ్లారి కమ్మ సంఘం నడిపే అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. ఎన్టీఆర్ పేరుతో నిత్యాన్నదానం చేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అన్న క్యాంటీన్లు ప్రజల ఆకలి తీర్చుతున్నాయని తెలిపారు.