లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

NRML: నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ సర్పంచ్ చెన్న మహేష్ మంగళవారం అందజేశారు. గ్రామానికి చెందిన కాల్వ సంతోష్ రూ. 60 వేలు, కాల్వ బోజవ్వ రూ.18 వేలు, కాసారం భూమన్న రూ. 54 వేల చెక్కులను అందజేశారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.