చంద్రబాబుకు మంత్రి డోలా కృతజ్ఞతలు
AP: సీఎం చంద్రబాబుకు మంత్రి డోలా వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సిండ్రోమ్‌తో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గురుకులం విద్యార్థి బోనెల చరణ్‌ను మంత్రి చొరవతో విశాఖ మెడికవర్‌లో చేర్పించారు. ఈ విషయం మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. వైద్య చికిత్సకు CMRF ద్వారా రూ.10 లక్షలు LOCను మంజూరు చేశారని మంత్రి తెలిపారు.